NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

Canada: ప్రముఖ స్కూల్స్ లో అస్థిపంజరాల గుట్టలు..!!

Canada: ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన కెనడాలోని “కామ్ లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్”.. దేశంలో ఒకప్పుడు ఇదే అతి పెద్ద విద్యా సంస్థ.. గత నెలలో ఈ స్కూల్ ప్రాంగణంలో ఒకేసారి 215 మంది పిల్లలు అస్థిపంజరాలు బయటపడ్డాయి. మృతుల్లో మూడేళ్ళ చిన్నారులు కూడా ఉన్నారు. ఒక రాడార్ ద్వారా లభ్యమైన సమాచారంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు దేశవ్యాప్తంగా మూసి ఉన్న ఇతర రెసిడెన్షియల్ స్కూల్ పై దృష్టి సారించారు. ఈ క్రమంలో వాంకోవర్ లోని కొవెస్సెస్ ఫస్ట్ నేషనల్ ప్రాంతంలోని “మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్” ప్రాంగణంలో రాడార్ ద్వారా సర్చ్ చేయడంతో 600 లకు పైగా గుర్తుతెలియని అస్థిపంజరాలను అధికారులు గుర్తించారు..

In Canada: schools 600 indigenous bodies
In Canada: schools 600 indigenous bodies

ఇందులో వందల మందికి పైగా చిన్నారులను సమాధి చేసినట్లు తెలుస్తోంది. దీంతో తవ్వకాలు చేసి పిల్లల అవశేషాలను బయటకు తీస్తున్నారు.. ఈ అక్రమ పాఠశాల 1889 నుంచి 1977 మధ్య రోమన్ కాథలిక్ చర్చి ఆధ్వర్యంలో నడిచింది. ఈ పాఠశాలలో బలవంతపు మత మార్పిడులు జరిగేవని, మాట వినని వారిని తీవ్రంగా కొట్టేవారని అంటున్నారు. చిన్నారులపై శారీరక, లైంగిక వేధింపులు జరిగాయని, మాతృభాష మాట్లాడినందుకు చిన్నారులను కొట్టేవారని ఇటీవల కెనడా ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇలాంటి చర్యల వల్ల కనీసం 6వేల మంది చనిపోయి ఉంటారని ఒక అంచనా మాత్రమే. మరోవైపు కెనడాకు చెందిన పిల్లలపట్ల విద్యాసంస్థల్లో దారుణాలు జరిగాయంటూ.. 5 సంవత్సరాల క్రితం నిజనిర్ధారణ కమిషన్ ఒక నివేదికను వెల్లడించింది. సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల కనీసం 3,200 మంది పిల్లలు చనిపోయి ఉంటారని ఒక్క కామ్ లూప్స్ పాఠశాలలోనే 1915-1963 మధ్యలో 51 మంది చనిపోయి ఉంటారని ఈ నివేదిక తెలిపింది. అయితే ఈ అక్రమ పాఠశాలలో అంతకు మించిన స్థాయిలో ఏదో ఉదంతం జరిగినట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి..

 

తాజా సంఘటనలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ట్విట్టర్ వేదికగా స్పందించారు. “చిన్నారుల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మారివల్ రెసిడెన్షియల్ స్కూల్లో చిన్నారుల అస్తిపంజరాలు బయట పడిన వార్త విని నా గుండె వెంటనే బద్దలైంది. ఇది తీవ్ర విచారకరం. ఈ దారుణాల వెనుక ఉన్న వాస్తవాలను మేము ఖచ్చితంగా బయటపెడతామని” ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు..

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju