Height Growth: చాలామంది హైట్ పెరగాలని కోరుకుంటూ ఉంటారు.. ఇందుకోసం జిమ్ కి వెళ్లడం, యోగా ఆసనాలు వేయడం ఏం చేస్తూ ఉంటారు.. వీటితో పాటు ప్రతి రోజూ మనం తినే ఆహారం కూడా మనం ఎత్తు పెరగడానికి దోహదపడుతుంది.. ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే త్వరగా హైట్ పెరగవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..!!
* బాదం పప్పు :
బాదంలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ప్రతిరోజు నానపెట్టిన బాదం పప్పు తినడం వల్ల త్వరగా హైట్ పెరుగుతారు. ఫైబర్, ఫోలేట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూరగాయలు తినడం వలన హైట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
* బీన్స్ :
ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండటం వలన త్వరగా హైట్ పెరగడానికి పెరిగేలా చేస్తుంది. బీన్స్ ప్రతిరోజు మన డైట్ లో భాగం చేసుకోవడం వల్ల ఎత్తు పెరగచ్చు.
* పాలు :
పాలలో ఉండే ప్రోటీన్స్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటివి ఎముకల్ని దృఢంగా ఉంచుతాయి. ప్రతిరోజు రెండు గ్లాసుల పాలు తాగే వారు హైట్ పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
* గుడ్లు :
ప్రతిరోజు 2 ఉడకబెట్టిన గుడ్లు కోడి గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కోడిగుడ్లలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎత్తు పెరగడానికి బాగా సహాయపడతాయి.
*చికెన్ :
కోడిగుడ్ల లోనే కాదు కోడి మాంసం ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మజిల్స్ ని దృఢంగా ఉండేలా చేస్తాయి. మీ డైట్ లో చికెన్ ని భాగం చేసుకోవడం ద్వారా త్వరగా ఎత్తు పెరగవచ్చు.