Nani : నాచురల్ స్టార్ నాని విలక్షణ కథలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అలరిస్తూ ఉంటాడు.. నాని అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.. నాని తరువాత సినిమా ఏమిటి అంటే.. వెంటనే టక్ జగదీష్ అంటూ చెప్తుంటారు. కానీ నాని మరో క్రేజీ సినిమాలో కూడా బిజీగా ఉన్నాడని తెలుసా..!? టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. నాని క్రేజీ ఇమేజి, రాహుల్ టేకింగ్ తో ఓ సినిమా రూపొందుతుంది. “శ్యామ్ సింగరాయ్” అని పేరు కూడా పెట్టేసారు. ఈ సినిమా గురించి అప్డేట్ కూడా లేదు.. హీరో నాని పుట్టినరోజు ఈరోజు.. ఈ సందర్భంగా శ్యామ్ సింగరాయ్ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు..
సోషల్ మీడియాలో శ్యామ్ సింగరాయ్ సినిమా ఫస్ట్ లుక్ వైరల్ అవుతోంది.. ఈ సినిమాను రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాగ వంశీ నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు. వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం అందిస్తున్నారు. శ్యామ్ సింగరాయ్ సినిమా ఫస్ట్ లుక్ తోనే ఆకట్టుకున్నాడు.. ఈ సినిమాపై అభిమానుల్లో తారస్థాయి అంచనాలు ఉన్నాయి..