NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: ఆ చెట్టు వద్దకు అధికారులు క్యూకట్టారు..! ఫోటోలు దిగారు..! విశేషమేమిటంటే..?

KCR: పలువురు అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా ఓ చెట్టు వద్దకు క్యూకట్టారు. అక్కడ అందరూ ఫోటోలు దిగారు. దానికి విశేషం ఏమిటంటే తెలంగాణలో హరితహారం మొదటి విడతలో భాగంగా సీఎం కేసిఆర్ నిర్మల్ జిల్లాలోని దేవునిగూడెం సమీపంలో ఓ మొక్కను నాటారు. ఆ మొక్కను నాటి ఆరేళ్లు అవుతుండగా అది ఏపుగా పెరిగి నేడు పెద్ద చెట్టుగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఏడవ విడత హరితహారం కార్యక్రమం కొనసాగుతుండగా నేతలు అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో భాగంగా నాడు కేసిఆర్ నాటిన మొక్క వద్దకు పెద్ద సంఖ్యలో అధికారులు, అనధికారులు వెళ్లి చెట్టుతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నాటిన మొక్క కావడంతో అధికారులు ఆ మొక్కను సంరక్షించే బాధ్యతను తీసుకున్నారు. అటవీశాఖ అధికారులు ఆ మొక్కకు ట్రీగార్డును ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

officials take photo at tree which planted by CM KCR in first phase Haritha haram
officials take photo at tree which planted by CM KCR in first phase Haritha haram

Read More: Driving License: డ్రైవింగ్ లైసెన్సు పొందడం ఇక సులభతరం..!ఎలా అంటే..?

తాజాగా అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆర్ శోభ, జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ తదితర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి పల్లే పకృతి వనాలను సందర్శించారు. వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటిన అనంతరం దేవునిగూడెంలో ముఖ్యమంత్రి కేసిఆర్ మొక్కను నాటి ఆరు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆ మొక్కను పరిశీలించారు. నాడు ముఖ్యమంత్రి స్వీయ పర్యవేక్షణలో నాటిన మొక్కలు ఇప్పుడు పెద్ద చెట్లు మారి ఆహ్లాదకరంగా ఉండటంతో వాటి వద్ద అధికారులు ఫోటోలు దిగారు. ఇదండీ విశేషం.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N