NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

ING First look: ఐ.ఎన్.జి లో మరో యాంగిల్ ను చూపించనున్న ప్రియదర్శి..!!

Share

ING First look: తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహా.. కొత్త సినిమాలను డైరెక్టుగా ఓటీటీ రిలీజ్ చేయడంతో పాటుగా డబ్బింగ్ సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్, స్పెషల్ షోలను స్ట్రీమింగ్ చేస్తూ వీక్షకులను అలరిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ను అందిస్తూ అందరి ఆదరణ పొందుతున్న ఆహా ఓటీటీ.. ఇప్పుడు ఇన్ ది నేమ్ అఫ్ గాడ్ (ఐ.ఎన్.జి ) అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని రెడీ చేసింది.. ఈ వెబ్ సిరీస్ లో కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు..!! తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు..!!

Aha OTT priyadarshi ING First look: released
Aha OTT priyadarshi ING First look: released

ఇప్పటివరకు తన కామెడీతో నవ్వించిన ప్రియదర్శి ఇందులో సీరియస్ రోల్ లో కనిపించబోతున్నారు ఈ సిరీస్ లో హీరోయిన్ నందిని రాయ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని కలిగించారు మేకర్స్. ఇందులో లో బాగా యాలతో ఉన్న ప్రియదర్శి సిగరెట్ వెలిగించి కుంటూ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. నందిని రాయ్ ఇంటెన్స్ లుక్ లో ఉంది. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

 

ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్లు గా తయారవుతుంది.. ఈ సిరీస్ ను సురేష్ కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మిస్తున్నాడు. కొత్త దర్శకుడు విద్యాసాగర్ ముత్తు కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇన్నాళ్ళు కామెడీ పాత్రలో మెప్పించిన ప్రియదర్శి మొదటిసారి సీరియస్ రోల్ లో కనిపించబోతున్నాడు. వరుణ్ డీకే సినిమాటోగ్రఫీ అందించగా.. నిఖిల్ శ్రీకుమార్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. దీపక్ అలెగ్జాండర్ సంగీతం సమకూరుస్తున్నారు..


Share

Related posts

Shruthi Selvam Latest Photos

Gallery Desk

Vizag Steel Plant : రాజీనామా పై గట్టిగానే నిలబడ్డ గంటా !మిగతా వారి మాటేమిటంట ?

Yandamuri

కమలమే నాకు మద్దతిస్తోందంటున్న ట్రంప్..!!

sekhar