NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Immunity Booster: ఈ పండు వారంలో ఒకటి చాలు.. ఇమ్యూనిటీ బోలెడు..!!

Immunity Booster: ఎండాకాలం వచ్చిందంటే చాలు.. నేరేడు పండ్ల సీజన్ మొదలవుతుంది.. సహజ సిద్ధంగా లభించే ఈ పండు పోషకాల గని.. అనారోగ్య నివారిణి.. ఒక్క పండే కాదు ఈ చెట్టు ఆకులు, బెరడు కూడా అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.. ఇందులో విటమిన్ సి అధికంగా లభిస్తుంది దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. వర్షాకాలంలో వచ్చే అనేక రోగాలను తట్టుకునే శక్తిని ఇస్తుంది.. ప్రస్తుతం కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే అధికంగా రోగనిరోధక శక్తి అవసరం.. అటువంటి రోగనిరోధక శక్తిని అందించే ఈ పండు రోజు తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Immunity Booster: health benefits jamun fruit
Immunity Booster health benefits jamun fruit

 

* నేరేడు లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. శరీరానికి ఎంతో అవసరమైన హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సాయం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో దీని పాత్ర అధికం. ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

* ఈ పండులో కాల్షియం, పొటాషియం, ఇనుము విటమిన్ సి అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి వ్యాధినిరోధక శక్తిని ఇస్తుంది. ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.

*ఆస్తమా, బ్రొకైటిస్ వంటి వాటి చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుంది. క్రోనిక్ దగ్గును నివారిస్తుంది. దీర్ఘకాలికంగా శ్వాస సంబంధిత రోగాలతో బాధపడే వారికి నేరేడు పళ్ళు తరచుగా తింటుంటే రోగనిరోధక శక్తి పెరిగి శ్వాససంబంధ రోగాలు దూరం అవుతాయి.

*నేరేడు పండులో విటమిన్ సి,ఏ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి సమస్యలు, నొప్పులు నివారించడంలో నొప్పులు నివారించడంలో దోహదపడుతుంది.

*వీటిని రోజు తినడం వల్ల అజీర్తి సమస్యలు దూరమవుతాయి. ఆహారం బాగా జీర్ణం అవుతుంది. జీవక్రియల రేటు మెరుగుపడుతుంది.

*మధుమేహం ఉన్నవారికి నేరేడు పండు చక్కని ఔషధం. దీనిని రోజూ తింటే రక్తంలోని చక్కెర శాతం క్రమబద్ధం అవుతుంది. తరచు దాహం వేయడం, మూత్రానికి పోవడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. ఇది మంచి యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది.

*గర్భిణీ స్త్రీలు తింటే తల్లికి, బిడ్డకి మంచిది. మెదడును చురుగ్గా ఉండడానికి, హార్ట్ బీట్ సరిగ్గా ఉంచడానికి నేరేడుపండు ఔషధంలా పనిచేస్తుంది.

*అల్ల నేరేడు చెట్టు ఆకులను ఉండే ద్వారానికి తోరణాలుగా కడితే ఇంట్లోకి హానికర క్రిములు బ్యాక్టీరియా వైరస్ రాకుండా ఉంటాయి.

*అల్ల నేరేడు పండ్లు లివర్ కు మేలు చేస్తాయి. లివర్ ను శుభ్రం చేస్తాయి . కిడ్నీలో రాళ్లను కరిగిస్తాయి. కడుపులోకి ప్రమాదవశాత్తు తలవెంట్రుకలు కూడా అల్ల నేరేడు పండ్లు కరిగిస్తాయి.

*అధిక రక్తపోటుకు గురి కాకుండా చూస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

*అందాన్ని పెంచడంలోనూ దీని పాత్ర అధికమే. నేరేడు పండు తరచుగా తినడం వల్ల చర్మం పై ముడతలు పడవు. వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రావు.

ఇదండీ నేరేడు పండ్ల కు సంబంధించిన కొన్ని ప్రయోజనాలు.. మీరు తప్పకుండా వీటిని తినండి..

author avatar
bharani jella

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?