ING Trailer: ప్రియదర్శి, నందిని రాయ్ జంటగా నటిస్తున్న వెబ్ సిరీస్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్.. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. ఇంట్రడ్యూసింగ్ మీనా పాత్ర రివీల్ చేస్తూ విడుదల చేసిన వీడియో లో సినిమాలో నందిని రాయ్ పాత్ర ఎలా ఉంటుందో తెలియజేశారు. ఈ వీడియో కూడా సినీ ప్రేక్షకులను అలరించింది.. తాజాగా ఈ సినిమా టీజర్ హీరో కార్తీక్ విడుదల చేశారు..

అరేయ్ నీకు సైతన్ కి దేవుడికి తేడా ఏంటో తెలుసారా.. సైతన్ నీలో ఉన్న కోరికను రెచ్చగొట్టి నిన్ను తప్పు చేసి.. నువ్వు కష్టపడుతుంటే చూసి ఆనందిస్తాడురా.. కానీ దేవుడు అలా కాదు.. చాలా సింపుల్.. నువ్వు తప్పు చేసినప్పుడే పుటుక్కుమని చంపేస్తాడు.. అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్.. ఈరోజు నా పెళ్ళాంని నువ్వు చూస్తే.. రేపు నీ పెళ్ళాంని ఇంకొకడు చూస్తాడు ఇది సృష్టి ధర్మం రాజా.. అంటూ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఈ ట్రైలర్ ముగిస్తుంది.. ఈ సినిమాలో సురేష్ కృష్ణ దర్శకత్వం రూపొందించారు.. ఇప్పటికే నందిని రాయ్ ఎన్నో వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రియదర్శి నందిని రాయ్ కాంబినేషన్ల రానున్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ఈ వెబ్ సిరీస్ జూన్ 18న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది..