Ramaraju For Bheem Teaser: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)..!! ఇటీవల సినిమా నుంచి విడుదలైన “రామరాజు ఫర్ భీమ్ టీజర్” సెన్సేషనల్ రికార్డులు సెట్ చేస్తోంది..! ఇప్పటికే టాలీవుడ్ హిస్టరీ లోనే ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ లైక్డ్ టీజర్ గా రికార్డు సృష్టించిన ఈ టీజర్.. తాజాగా 50 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి టాలీవుడ్ లో సరికొత్త రికార్డు ను సృష్టించింది..!!
కొమరం భీం పాత్రలో తారక్ ఒదిగిపోయాడు.. రగిలే నిప్పు కనిపించాడు.. బ్యాగ్రౌండ్ లో చరణ్ వాయిస్ ఆ అగ్గికి మరింత ఫైర్ తీసుకొచ్చింది..
“వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్..
నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయ్..
వాడి పొగరు ఎగిరే జెండా..
వాడి ధైర్యం చీకట్లను చీల్చి మండుటెండ..
వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ..
నా తమ్ముడు గోండు బెబ్బులి.. కొమరం భీమ్..” అంటూ చరణ్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న పాత్రను పరిచయం చేశాడు.. ఈ టీజర్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది..!! ఈ టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సంగీత దర్శకుడు కీరవాణి అదరగొట్టేశాడు. ఎలాంటి సినిమాకైనా తనదైన శైలిలో నేటి తరానికి అద్భుతమైన మ్యూజిక్ అందించగల ఈ సంగీత దర్శకుడు కోసం స్పెషల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సెట్ చేశాడు.. టీజర్ చూస్తుంటేనే అర్థమవుతోంది థియేటర్స్లో మోతమోగేలా ఉందని. ఇక జక్కన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. పాన్ ఇండియా సినిమాగా ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాకముందే.. టీజరే ఇంత పెద్ద రికార్డు క్రియేట్ చేస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి..