Richa Gangopadhya: లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది రీచా గంగోపాధ్యాయ.. మిరపకాయ, మిర్చి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది తాజాగా ఈ అమ్మడు మగ బిడ్డకు జన్మనిచ్చినటు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది..
రీచా గంగోపాధ్యాయ సినిమాల్లో ఎక్కువ కాలం రాణించలేకపోయింది.. దీంతో తన చిన్ననాటి స్నేహితుడు జోలాంగేల్లాను రహస్యంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. కొద్దిరోజుల వరకు ప్రెగ్నెన్సీ మ్యాటర్ ను కూడా సీక్రెట్ గా ఉంచింది రీచా.. మే 27న మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు తెలియజేసింది.. బేబీ బాయ్ ఫోటోలను కూడా షేర్ చేసింది.. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలియజేస్తున్నానని తెలిపింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?