World Record: సాధారణంగా ఒక కాన్పులో ఒక బిడ్డకు జన్మనివ్వడం సహజం.. కొన్నిసార్లు ఒకే కాన్పులో ట్విన్స్ జన్మిస్తారు, కొన్ని సందర్భాల్లో ముగ్గురు, నలుగురు పుట్టిన సంగతి విన్నాం.. అయితే దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఏకంగా ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చి.. వండర్ ఉమెన్ గా వరల్డ్ రికార్డు క్రికెట్ చేసింది.. దక్షిణాఫ్రికాకు చెందిన గోసియామీ థామర సిట్ హోల్ ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మించినట్లు తనే స్వయంగా ప్రకటించింది..!!
ప్రిటోరియా నగరంలో సోమవారం రాత్రి తన భార్యకు సిజేరియన్ ద్వారా ప్రసారం జరిగిందని ఏడుగురు మగ శిశువులకు ముగ్గురు ఆడ శిశువులకు జన్మించిందని ఆమె భర్త టెబోగో సోటెట్సీ తెలిపారు అయితే తన భార్య గర్భం ధరించి ఏడు నెలల 7 రోజులు అయిందని నెలలు నిండకుండానే పదిమందికి జన్మనిచ్చిందని వివరించారు. తనకు చాలా ఆనందంగా ఉందని ఇంతకంటే ప్రస్తుతం ఏం మాట్లాడలేనని భావోద్వేగానికి గురయ్యారు. అయితే ప్రపంచంలో ఇంతమంది పిల్లలు ఒకే కాన్పులో జన్మించడం ఇదే మొదటిసారి అయి ఉంటుందని అనుకుంటున్నారు. గోసియామీ థామర సిట్ హోల్ కు ఇంతకుముందు ట్వీన్స్ జన్మించారు.