Sreedevi Soda Center: టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం శ్రీదేవి సోడా సెంటర్.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ అందర్నీ అలరించడం తో పాటు యూట్యూబ్ లో #1 ట్రెండ్ గా రికార్డు సృష్టించింది..!! తాజాగా ఈ సినిమా విడుదల కాకముందే కాసుల వర్షం కురిపిస్తోంది.. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను జి నెట్వర్క్ భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకుంది..!!
ఈ చిత్రాన్ని కరుణాకర్ దర్శకత్వంలో 70mm బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి నటిస్తోంది. లైటింగ్ సూరి బాబు హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ తో అలరించనున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్, డబ్బింగ్ పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.. సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు సుధీర్.. ఈ సినిమా సాటిలైట్ డిజిటల్ రైట్స్ జి కొనుగోలు చేసింది. జి నెట్వర్క్ థియేట్రికల్ రైట్స్ కోసం ఏకంగా రూ.9కోట్లు చెల్లించింది. సుధీర్ బాబు కి మంచి మార్కెట్ ఉన్నప్పటికీ శ్రీదేవి సోడా సెంటర్ కు నాన్ థియేట్రికల్ రైట్స్ కు ఇంత భారీ మొత్తం రావడం చాలా పెద్ద డీల్ గా చెప్పుకోవచ్చు.. ఈ డీల్ తో సినిమా విడుదల కాకముందే లాభాలు పొందడంతో నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.