Today Gold Rate: (15/6/2021) పసిడి ప్రియులకు భారీ ఊరట.. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కూడా తగ్గాయి.. బంగారం ధర వెలవెలబోతోంది పసిడి ధర నేలచూపులు చూస్తోంది.. కేంద్ర ప్రభుత్వం ఈరోజు నుంచి బంగారం నగలపై హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది..!! ఇప్పటినుంచి జువెలరీ షాపుల్లో హాల్ మార్క్ ఉన్న నగలను మాత్రమే అమ్మాలని ఆదేశించింది.. ఈ కొత్త రూల్ వలన ప్రజలు మోసపోకుండా ఉంటారు. హల్ మార్క్ ఉన్న నగలు అంటే అవి నాణ్యమైన నగలు అని అర్థం..!!

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర తో పోల్చుకుంటే రూ.240 తగ్గింది దీంతో ఈరోజు బంగారం ధర రూ.45,500 కి క్షీణించింది అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.250 తగ్గి రూ.49,640 కి పడిపోయింది.. వరుసగా రెండు రోజులుగా స్థిరంగా ఉంటున్న వెండి ధరలు ఈ రోజు అమాంతం పడిపోయాయి. ఈరోజు వెండి ధర భారీగా తగ్గింది. నిన్నటి రేటు తో పోల్చుకుంటే ఏకంగా రూ.800 తగ్గింది . దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.76,500 కి పడిపోయింది.. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. అలాగే బంగారం కొనుగోలు చేసేవారు ఇక్కడినుంచి హాల్ మార్క్ ఉన్న నగలను మాత్రమే కొనండి.