Today Gold Rate:(25/5/2021) బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త.. వరుసగా మూడు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు కూడా తటస్థం గానే ఉన్నాయి.. ఈరోజు కూడా బంగారం ధర లో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు.. నిన్నటి ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి కొన్ని రోజులుగా బిట్ కాయిన్, క్రిప్టో, డాలర్ కరెన్సీ విలువ తగ్గుతుంది.. దాంతో బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు ఇన్వెస్టర్లు.. మనం ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు పరిశీలించుకుంటే.. ఈ 54 రోజుల్లో బంగారం ధర స్థిరంగా ఉన్న ప్రతిసారి పెరుగుతోంది.. అదేవిధంగా ఇప్పుడు కూడా బంగారం ధరలు పెరగనున్నాయి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..
మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600 వద్ద.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,750 వద్ద యధావిధిగా కొనసాగుతోంది.. ప్రస్తుతం బంగారం ధర 50 వేలకు దగ్గరలో ఉంది రానున్న మూడు నెలల్లో బంగారం ధరలు మరింత పెరగనున్నాయి.. దీంతో 60 వేలకు బంగారం ధరలు చేరుకున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. ఒకవైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే మరోవైపు వెండి ధరలు పెరిగాయి.. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు పెరిగాయి.. నిన్నటి ధర కి రూ.300 పెరిగి.. ఈరోజు కిలో వెండి ధర రూ.76,000 కి ఎగసింది..