Today Gold Rate: వరుసగా 10రోజుకు చేరిన బంగారం ధర తగ్గుదల.. ఇదే ట్రెండ్ కొనసాగనుందా..!!

Share

Today Gold Rate: వరుసగా 9 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు కూడా కూడా తగ్గింది.. దీంతో వరుసగా 10 రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తుంది.. ఈ 10 రోజులలో ఒక్కరోజు కూడా బంగారం ధర స్థిరంగా లేదు.. అంటే బంగారం ధరల్లో తగ్గుదల మొదలైంది.. బంగారం ధర వరుసగా 10 రోజులు తగ్గడం హైలెట్ అంశంగా చెప్పుకోవచ్చు.. దేశీయ మార్కెట్ విశ్లేషకులు బంగారం ధరలు మరింత తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెబుతున్నారు..

Today Gold Rate: falls down silver price constant
Today Gold Rate: falls down silver price constant

Read More: Blood Group: మీ బ్లడ్ గ్రూప్ ని బట్టి కొన్ని ఆసక్తికరమైన నిజాలు.. ఈ బ్లడ్ గ్రూపు వాళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారా..

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర తో పోల్చితే రూ. 90 తగ్గి రూ.43,900 కి క్షీణించింది.. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.100 తగ్గింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ. 47,890 కి దిగివచ్చింది.. ఇదే బంగారం ధరలు సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ, వైజాగ్, బెంగుళూరు, కేరళ, మైసూర్, మంగళూరు, భువనేశ్వర్ లో కూడా ఇలాగే ఉన్నాయి. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు మాత్రం ఇంకా కొన్ని రోజులు వేచి చూడడం మంచిది అంటున్నారు మార్కెట్ నిపుణులు.. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గుతాయని అని చెబుతున్నారు వరుసగా మూడు రోజులు బంగారం ధరలు పెరిగితే అప్పుడు బంగారం కొనుగోలు చేయమని సూచిస్తున్నారు. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు కూడా అదే బాట పయనించింది. ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పులూ చోటు చేసుకోలేదు. ఈరోజు కిలో వెండి ధర రూ.73,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.


Share

Related posts

బచ్చన్ ఫ్యామిలీ విక్టరీ వెనుక కథేంటి?

sekhar

బ్రేకింగ్ : చైనాకు కేంద్ర ప్రభుత్వం మరో ఝలక్..! వేల కోట్లు పోయే….

arun kanna

Remdesivir : కేంద్రం కీలక నిర్ణయం..! కరోనా వ్యాధి గ్రస్తులకు గుడ్ న్యూస్..!!

somaraju sharma