Today Gold Rate: 9 రోజుల్లో 2,310 తగ్గిన బంగారం ధరలు..!! నేటి రేట్లు ఇలా..!!

Share

Today Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా 8 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు కూడా అతి స్వల్పంగా తగ్గాయి.. దీంతో వరుసగా 9వ రోజు కూడా బంగారం ధరలు దిగి వచ్చాయి.. ఒకవైపు బంగారం ధరలు తగ్గితే.. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది.. నేటి బంగారం, వెండి రేట్లు ఈవిధంగా ఉన్నాయి.

Today Gold Rate: slightly decreases silver price constant
Today Gold Rate: slightly decreases silver price constant

సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర అతి స్వల్పంగా రూ.10 తగ్గి రూ.43,990 కి చేరింది.. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా అతి స్వల్పంగా రూ.10 తగ్గి రూ.47,990 కి చేరింది.. ఇవే ధరలను ఒకసారి జూన్ 12 వ తేదీ తో పోల్చుకుంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 ఉంది. ఇప్పుడు రూ.43,990 కి చేరింది. అంటే కేవలం 9 రోజులలోనే బంగారం ధర రూ. 2,110 తగ్గింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,300 ఉంటే.. నేడు రూ.47,990 కి చేరి.. 9 రోజులలోనే బంగారం ధర రూ. 2,310 తగ్గింది.. కేవలం తొమ్మిది రోజుల్లోనే బంగారం ధరలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి.. వెండి ధర వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు మాత్రం స్థిరంగా ఉంది. ఈరోజు వెండి ధరలు నిన్నటి ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజు కిలో వెండి ధర రూ.73,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి ఇది గుడ్ న్యూస్. అలాగే బంగారం పై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఇది బ్యాడ్ న్యూస్ గా చెప్పవచ్చు.


Share

Related posts

Breaking: పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా టైటిల్ పేరు “భగత్ సింగ్”..??

sekhar

Big Breaking: టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం ఇదీ..!!

somaraju sharma

Akshara Gowda New HD Photos

Gallery Desk