VarunSandesh – Indhuvadana: వరుణ్ సందేశ్ మళ్ళీ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.. మెగాస్టార్ చిరంజీవి హిట్ సాంగ్ అయినా ఇందువదన పాటలోని లిరిక్ ను టైటిల్ గా ఎందుకు ఎంచుకున్నారు.. తాజాగా ఇందువదన మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు..
వరుణ్ సందేశ్ హీరోగా పలకరించి ఆ కాలమే అయింది.. బిగ్ బాస్ షోలో వరుణ్ సందేశ్ కు మంచి ఇమేజ్ క్రియేట్ అయింది.. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు.. ఒకప్పుడు హ్యాపీ డేస్ కొత్త బంగారం చిత్రాలతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసాడు.. ఏమైంది ఈ వేళ అంటూ రొమాంటిక్ యాంగిల్ చూపించారు. ఆ తరువాత సరైన హిట్ కొట్టలేకపోయారు. మల్టీస్టారర్ చిత్రాల్లోనూ కనిపించి మెప్పించాడు. డి ఫర్ దోపిడి, మామ మంచు అల్లుడు కంచు.. సినిమా లతో నవ్వించారు. ఇక ఆ తర్వాత సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చారు.. బిగ్ బాస్ షో తో అందర్నీ మెప్పించారు.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు వరుణ్ సందేశ్ ఇందువదన సినిమా తో రీ ఎంట్రీ గట్టిగా ప్లాన్ చేశారు..
ఈ మూవీ ఫస్ట్ లుక్ అదిరిపోయింది.. ఇంతకు ముందు వరుణ్ సందేశ్ ఒక వీడియోలో ఈ సినిమా గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు.. ఈ మూవీ ఫస్ట్ లుక్ అదిరిపోతుందని, ఊహించని విధంగా ఉంటుందని, దీనమ్మ వరుణ్ సందేశ్ ఏంట్రా ఎలా ఉన్నాడు అనుకోవాలని.. ఆ రేంజ్ లో ఉంటుందని చెప్పారు.. అచ్చం వరుణ్ సందేశ్ ఎలా చెప్పాడో ఖచ్చితంగా అలానే ఉంది..ఫస్ట్ లుక్ తోనే వరుణ్ సందేశ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. తనలోని రొమాంటిక్ యాంగిల్ మరోసారి చూపించాడు.. శ్రీ బాలాజీ పిక్చర్స్ పై రాబోతున్న ఈ సినిమాకి ఎన్.ఎస్.ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు..
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!