Yami Gautam: యామి గౌతమ్ నిన్న రహస్యంగా వివాహం చేసుకున్న సంగతి హాట్ టాపిక్ గా మారింది.. యామి పెళ్లి చేసుకున్న విషయాన్ని తనే నిన్న ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.. తాజాగా తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది..!! ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!
Read More: Richa Gangopadhya: ఒక బిడ్డకు జన్మనిచ్చిన మిర్చి బ్యూటీ..
బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్, ఆదిత్య ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది.. అయితే వీరిద్దరూ నిన్నటితో ఒక్కటయ్యారు.. యామి తన మెహందీ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.. మెహందీ వేడుకలు యామి మరింత అందంగా ఉంది. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ మెహందీ వేడుకల్లో మెరిసిపోతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే ఈ బ్యూటీ హిందీ సినిమాల్లో చాలా బిజీగా ఉంది..