Oke Oka Jeevitham: ఆకట్టుకుంటున్న “ఒకే ఒక జీవితం” మోషన్ పోస్టర్..!!

Share

Oke Oka Jeevitham: విభిన్న కథాంశాలను పరిచయం చేస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేస్తున్నాడు శర్వానంద్.. శ్రీకారం సినిమా తో హిట్ అందుకున్న శర్వా  అదే ఊపులో వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు.. శర్వా  కెరీర్లో 30 చిత్రంగా రూపొందుతున్న చిత్రం శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవల ఈ సినిమా “ఒకే ఒక జీవితం” టైటిల్ ను ఖరారు చేశారు.. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు నిర్మాతలు..!!

Oke Oka Jeevitham: movie motion poster out
Oke Oka Jeevitham: movie motion poster out

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా సంగీతం నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన రీతువర్మ నటిస్తోంది. అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్  ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం హైలెట్ హైలెట్గా నిలవనుంది. ఈ చిత్రంతో పాటు శర్వానంద్ మహా సముద్రం, ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రాలతో బిజీగా ఉన్నారు..


Share

Related posts

జగన్ స్ట్రాంగ్ మెసేజ్ పంపబోతున్నాడా .. డిల్లీ సిద్ధమా – నయా రాజకీయం ! 

sekhar

Confidential Go’s: ఎందుకో ఈ యాగీ..! వైఎస్, కిరణ్ రెడ్డి, బాబు హయాంలలో ఇలా జరగలేదా..?

somaraju sharma

Kalyan ram : కళ్యాణ్ రామ్ – మైత్రీ మూవీ మేకర్స్ లేటెస్ట్ సినిమా ప్రారంభం ..!

GRK