Gangubai Kathiawadi: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆర్ఆర్ఆర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది ఈ ముద్దుగుమ్మ.. సంచలన దర్శకుడు సంజయ్ భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం “గంగుభాయ్ కతీయావాడి”..!! ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు..!!
ముంబైలోని కామతీపూర్లో సెక్స్ వర్కర్ అయినా గంగుభాయ్ కతీయావాడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియాభట్ వేశ్య పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు ఈ చిత్రాన్ని బన్సాలి ప్రొడక్షన్స్ పై ప్రేరణ సింగ్, పెన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై 30 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇంతకుముందు తెలియజేశారు. అయితే కరోనా వలన వాయిదా వేస్తారో.. లేదంటే ఆ టైం కి పరిస్థితులన్నీ చక్కబడితే రిలీజ్ చేస్తారో చూడాలి..